స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్ల తర్వాత తొలి రోడ్డు మార్గం: సంబరాల్ లో సిపు గ్రామస్థులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పితోర్‌గఢ్

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్గఢ్ జిల్లాలోని సిపు గ్రామానికి రోడ్డు మార్గం నోచుకోలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో తొలిసారిగా వాహనం చేరుకుంది. దీంతో గ్రామస్థులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించినట్లు సర్పంచ్ సరోజని సీపాల్ తెలిపారు.