పెద్దపల్లి జిల్లాలో దివ్యాంగులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోని దివ్యాంగులకు స్వయం ఉపాధిపై 10 రోజుల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణలో వ్యాపార నిర్వహణతో పాటు దివ్యాంగులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగి, 40 శాతం వైకల్యం ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోపు సుల్తానాబాద్‌లోని దివ్యాంగుల పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.