వందేమాతరం గేయంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్లో వందేమాతరం పూర్తి గేయం ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా వందేమాతరం పూర్తిగా ఆలపించాల్సిందేనని, కాశ్మీర్ ప్రజలు జైలులో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ఆయన మండిపడ్డారు. కూటమిలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ తమపై ఒత్తిడి తేలేదని, చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ఒమర్ స్పష్టం చేశారు.