రాష్ట్రంలో కరువు పరిస్థితులు: కేంద్రానికి సహాయం కోరిన తెలంగాణ కేబినెట్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్ నినో కారణంగా పలు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. వానకాలంలో లోటు వర్షపాతం కారణంగా అనేక మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడిందని, కరువు మండలాల ప్రకటనతోపాటు కేంద్రం నుంచి తగిన సాయం కోరతామని ఆయన స్పష్టం చేశారు.