ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే తేల్చాలంటూ పెద్దపల్లి కలెక్టర్ హుకుం

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అందిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.