భవిష్యత్ అవసరాల కోసం దేశం స్వావలంబన సాధించడం అత్యంత కీలకం: మోదీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

భవిష్యత్ అవసరాల కోసం దేశం స్వావలంబన సాధించడం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు పీఐబీ ఇండియా వెల్లడించింది. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 5జి సేవలు అందుబాటులోకి వచ్చాయని, డిజిటల్ చెల్లింపులు పెరిగాయని, ప్రపంచ వేదికపై భారత్ గళం మరింత బలపడిందని పీఐబీ ఇండియా వివరించింది.