కాణిపాకంలో ఇంటింటికీ తిరిగి ఓట్ల వేటలో దూసుకెళ్లిన ఎమ్మెల్యే
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐరాల
కాణిపాకంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి చల్లా హేమావతి మల్లికార్జున్ కు సైకిల్ గుర్తుపై, జెడ్పీటీసీ అభ్యర్థి మహేష్‌కు గాజు గ్లాసు గుర్తుపై ఓటేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు.