ట్యాంక్ బండ్పై ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ నగరంలో వైభవంగా సాగిన వినాయక నిమజ్జన మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్పై ఉన్న క్రేన్ నెం.4 వద్ద ఘనంగా పూర్తయింది. భక్తుల జయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు మరియు మున్సిపల్ అధికారులు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు.