సినిమా అప్డేట్: అక్టోబర్ 18న విశ్వక్ సేన్ కల్ట్ ట్రైలర్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా కల్ట్ ట్రైలర్ ఈనెల పద్దెనిమిదో తేదీన విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.