ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ షాక్: ఎస్ఎంఎస్ డెత్ బగ్ తో కలకలం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆందోళనకు గురిచేసేలా ఒక సరికొత్త భద్రతా లోపం వెలుగు చూసిందని టెక్ నిపుణులు హెచ్చరించారు. ప్రత్యేకంగా రూపొందించిన టెక్స్ట్ మెసేజ్ పంపడం ద్వారా ఫోన్లను క్రాష్ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు పావెల్ బ్లాస్జిక్ అక్టోబర్ 29న గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. యూజర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈ మాల్వేర్ ఫోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేశారు.