సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్: తెరపైకి ది డర్టీ పిక్చర్ సీక్వెల్

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సుప్రసిద్ధ చిత్రం ది డర్టీ పిక్చర్కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల తర్వాత సరికొత్త కథతో ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు ఆమె తెలిపారు. రణవీర్ అల్లాబాదియా పాడ్కాస్ట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి భాగం మాదిరిగానే ఈ సీక్వెల్ కూడా ఓ మహిళా ప్రధాన కథాంశంతో రూపొందుతుందని, త్వరలోనే నటీనటులు తదితర వివరాలు వెల్లడవుతాయని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.