తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల పంపిణీ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలపై నిత్యావసర సరుకులు అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక కోరారు. త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.