ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం: తొమ్మిది మంది దుర్మరణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Florida
అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా ప్రాంతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని యూఎస్ రవాణా కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నుండి బహామాస్ బయలుదేరిన బిజినెస్ జెట్ అకస్మాత్తుగా నివాస ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం అందింది.