ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులో భాగంగా మిగిలిపోయిన 807 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెన్యువల్ చేసుకోని దుకాణాలతో పాటు గతంలో దరఖాస్తులు రాని షాపులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల వ్యాపారులు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 5న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.