అగ్నిమాపక సిబ్బందికి భారీ ఊరట: తేలికపాటి స్వదేశీ సూట్ రూపకల్పన

రిపోర్టర్: అశోక్ స్థలం: దిల్లీ

అగ్నిమాపక సిబ్బంది రక్షణ కోసం ఐఐటీ దిల్లీ మరియు డీఆర్డీఓ సంయుక్తంగా అత్యంత తేలికపాటి స్వదేశీ ఫైర్ ప్రొటెక్షన్ సూట్ను అభివృద్ధి చేశాయని సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సౌరవ్ బెనర్జీ తెలిపారు. కేవలం రెండు కిలోల బరువు ఉండే ఈ సూట్ పదమూడు వందల డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకోగలదని వెల్లడించారు. మార్కెట్ లో లభించే ఇతర సూట్లతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.