కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఖరారు: డిసెంబర్ 25న విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మచిలీపట్నం
హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రానికి 'రియాలిటీ' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఆయన ఆనంద్ అనే హోటల్ యజమాని పాత్రలో నటిస్తున్నారని, డిసెంబర్ 25వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది.