హోర్జ్ జలసంధిలో అక్రమంగా వెళ్తున్న చమురు నౌకను అదుపులోకి తీసుకున్న ఇరాన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో హోర్ముజ్ జలసంధిలో టోగో దేశపు జెండాతో వెళ్తున్న చమురు నౌక ట్రెండ్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. అక్రమంగా ప్రయాణిస్తోందన్న ఆరోపణలతో ఈ చర్య చేపట్టారు. మరోవైపు సౌదీ అరేబియా భద్రతకు సంబంధించి పాకిస్థాన్ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హూతీల దాడుల నుంచి సౌదీని ఏ స్థాయికైనా రక్షిస్తామని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి స్పష్టం చేశారు. అలాగే ఐరాస సాధారణ సభకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ నేతృత్వంలోని బృందానికి అమెరికా అనుమతిచ్చింది.