ములుగులో నీటి పొదుపు తప్పనిసరి: యాసంగి సాగుపై కలెక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: ములుగు
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ములుగు జిల్లాలో అందుబాటులో ఉన్న జల వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజలను కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున యాసంగి పంటలకు సాగునీరు విడుదల చేయడం కష్టతరమని స్పష్టం చేశారు. రైతులు అధికారులను సంప్రదించి, నీటి లభ్యతను బట్టి మాత్రమే పంటలు వేసుకోవాలని సూచించారు.