భారత్ కు పెను ముప్పుగా చైనా పాకిస్తాన్ సైనిక మైత్రి: రక్షణ రంగంలో కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

చైనా పాకిస్తాన్ సైనిక మైత్రి కేవలం ఆయుధాల అమ్మకాలకే పరిమితం కాకుండా వైమానిక క్షిపణి నావికా రంగాల్ లో విస్తరిస్తోందని రక్షణ నిపుణులు స్పష్టం చేశారు. ఈ వ్యూహాత్మక కూటమి భారత్ కు రక్షణపరంగా పెను సవాల్గా మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు సరిహద్దుల రక్షణే కాకుండా సమగ్ర సైనిక వ్యవస్థను ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని వారు తేల్చిచెప్పారు. సంయుక్త రక్షణ ఉత్పత్తులు ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచుతున్నాయని నిపుణులు వెల్లడించారు.