నిత్యావసర ధరల పెరుగుదలపై నేడు సీపీఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేసింది. నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్బంధాన్ని సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. తక్కువ పోలీసు ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు.