హైదరాబాద్‌లో దక్షిణ ప్రాంత పోలీస్ సమన్వయ కమిటీ భేటీ: ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసుల సమన్వయాన్ని మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్ వేదికగా అత్యున్నత స్థాయి పోలీసు సమన్వయ కమిటీ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అంట్రోల్ సెంటర్లో జరిగే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉగ్రవాదం, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడిపై ఈ సమావేశంలో ఉమ్మడి వ్యూహం రూపొందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.