హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం: మదీనా క్రాస్రోడ్డులో ఎగసిపడిన మంటలు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

దసరా పండుగ రోజు హైదరాబాద్లోని మదీనా క్రాస్రోడ్డు సమీపంలో ఓ బట్టల దుకాణ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు రావాలని అధికారులు వెల్లడించారు.