దిల్సుఖ్నగర్ సంతోషి మాత ఆలయ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కరీంనగర్

దిల్సుఖ్నగర్లోని సంతోషి మాత ఆలయంలో జరిగిన ఘటన అత్యంత హేయమని, ఇది ఏమాత్రం సహించరానిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్తో మాట్లాడి తక్షణ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు, భక్తులకు పూర్తి భద్రత కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.