వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజేలపై పోలీసుల నిషేధం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాతవరం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజేల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై తారకేశ్వరరావు మాట్లాడుతూ డీజే శబ్దాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించి శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.