ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్‌లో ఏపీకి తొమ్మిదవ స్థానం
రిపోర్టర్: విజయ్
స్థలం: దిల్లీ
నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్-2025 నివేదికలో విద్యుత్ వాహనాల ప్రోత్సాహకంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో, తెలంగాణ పదో స్థానంలో నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే ఏపీ ఒక స్థానం, తెలంగాణ రెండు స్థానాలు మెరుగుపరచుకున్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు, ఈవీ స్టార్టప్‌ల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించగా దిల్లీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.