విజయనగరం: వర్షాలు కురవాలని కోరుకుంటూ పైడితల్లి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మంగళవారం వేద పండితులు ఘనంగా వరుణ యాగం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించడంతో పాటు, వర్షాలు కురిస్తే అన్నదాతలు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా ఆమె వివరించారు.