ఆసియా క్రీడల భారత జట్టుకు ఎంపికైన కృష్ణ జైశంకర్
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
గాయాలను, కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ ఎట్టకేలకు భారత షాట్పుట్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు కృష్ణ జైశంకర్. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే చెన్నై వీడి తన కలను సాకారం చేసుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఆమె, ఆసియా గేమ్స్ 2026లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడా కుటుంబం నుంచి వచ్చిన ఆమె, కఠినమైన శిక్షణతో పాటు పట్టుదలతో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు తెలిపారు. యువ క్రీడాకారిణులకు ఆమె ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.