భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాను: శాస్త్రవేత్తల హెచ్చరిక జారీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Washington

సూర్యుడి ఉపరితలంపై సంభవించిన రెండు భారీ విస్ఫోటనాల కారణంగా భూమి వైపు పవర్ఫుల్ సౌర తుఫాను దూసుకొస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు మోస్తరు స్థాయి జియోమాగ్నెటిక్ తుఫాను హెచ్చరికను జారీ చేసింది. ఈ సౌర తుఫాను ప్రభావం వల్ల అంతరిక్షంలో పనిచేస్తున్న కొన్ని ఉపగ్రహాల పనితీరు, రేడియో కమ్యూనికేషన్లు, జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థలకు తాత్కాలికంగా ఆటంకం కలిగే అవకాశం ఉందని అంచనా వేశారు.