బాల్య వివాహాలను అరికట్టి బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రొఫెసర్ పిలుపు

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలోని మల్లంగుంట జడ్పీ హైస్కూల్ లో బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ డి.సాయిసుజాత అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను, చట్టపరమైన శిక్షలను విద్యార్థినులకు వివరించారు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.