ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలని లోకేష్ హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, తప్పు చేసిన వారు ఎక్కడికి పారిపోయినా చట్టపరంగా శిక్షించి తీరుతామని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు అధికారిక సామాజిక మాధ్యమం వేదికగా ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.