కిడ్నాప్, హత్య కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష.
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా గూడూరులో సంచలనం సృష్టించిన కిడ్నాప్ మరియు హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2013లో బాలాయపల్లి మండలానికి చెందిన జయచంద్రను కిడ్నాప్ చేసి హత్య చేసి, సాక్ష్యాలు తారుమారు చేశారు. నేరం రుజువు కావడంతో మత్తయ్య, బాబ్జాన్బాబ్జిలకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.