గాంధీ ఆశయ సాధనతోనే దేశాభివృద్ధి: రాజాపేటలో సర్పంచ్ కోయ మధు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేటలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచి కోయ మధు మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లో నడిస్తేనే దేశంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.