ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి హవా: జడ్పీటీసీ ఎన్నికల్ లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం

రిపోర్టర్: సురేష్ స్థలం: చిత్తూరు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లో కూటమి పార్టీలు ప్రభంజనం సృష్టించాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. నగరిలో కౌంటింగ్ సందర్భంగా మాజీ మంత్రి రోజా ఆందోళనకు దిగడం, రీకౌంటింగ్ కోరుతూ నిరసన తెలపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విపక్ష వైఎస్సార్సీపీ నామమాత్రపు స్థానాలకే పరిమితమైందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.