శ్రీనగర్ మైదానంలో పటిష్ట భద్రత మధ్య ఇరానీ కప్ మ్యాచ్
రిపోర్టర్: అశోక్
స్థలం: Srinagar
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని చర్చి లేన్‌లో ఉన్న ప్రఖ్యాత స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్‌ల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నామని జేకేసీఏ అధికారులు వెల్లడించారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం ఒకే గేటును ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంచనున్నట్లు వారు స్పష్టం చేశారు.