అమితాబ్ బచ్చన్ మొదటి సంపాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

మొదటి సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులను పోషించాలని భావించానని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో ఆయన తన తొలి చిత్రం అనుభవాలను పంచుకున్నారు. సాత్ హిందుస్తాని సినిమా ద్వారా వచ్చిన సంపాదనను తల్లిదండ్రుల బాధ్యతల కోసం కేటాయించాలని అనుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ కోసం జీవితాంతం కష్టపడిన తల్లిదండ్రుల బాధ్యతలను తన భుజాలపైకి తీసుకోవాలని ఆశపడినట్లు అమితాబ్ వివరించారు.