భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించాలని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తూ, కంట్రోల్ రూముల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు.