వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

రిపోర్టర్: THOORPATI RAJASHEKAR స్థలం: నర్సంపేట

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని, ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.