రామలీలా మైదాన్ మార్చ్లో పాల్గొనాలని INC Andhra Pradesh పిలుపు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi / Andhra Pradesh

భారతదేశ ఆత్మను పరిరక్షించడంతో పాటు ఓట్ల దొంగతనాన్ని అరికట్టేందుకు తలపెట్టిన చలో ఢిల్లీ రామలీలా మైదాన్ మార్చ్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని INC Andhra Pradesh పిలుపునిచ్చారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఈ ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.