'కేసీఆర్ త్యాగం గుర్తుంచుకో': రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, త్యాగాలను విమర్శించే ముందు రేవంత్ రెడ్డి తన చరిత్రను బేరీజు వేసుకోవాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తన్నీరు హరీష్ రావు ఎండగట్టారు.