ఉద్యోగ హామీలను విస్మరించారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై వి.శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, మూడేళ్లయినా వాటిని నెరవేర్చలేదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వడం దసరా కానుక ఎలా అవుతుందని నిలదీశారు. పీఆర్సీ ప్రకటిస్తేనే అది అసలైన కానుక అవుతుందని, కాంట్రాక్టు ఉద్యోగుల నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపి ఏ మంత్రి తిన్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.