హత్రాస్‌లో రిటైైర్డ్ సైనికుడు, భార్య దారుణ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హత్రాస్
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో రిటైైర్డ్ సైనికుడు షమ్సుద్దీన్, ఆయన మొదటి భార్య సఫీనా దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చిరంజీవ్ నాథ్ సిన్హా వెల్లడించారు. ఆస్తుల కోసం రెండో భార్య సీమ తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి ఈ హత్యలకు పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు మూడు వందలకు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, ఏడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.