మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబ్ నగర్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తిప్రదాత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి మాజీ మంత్రి, మహబూబ్ నగర్ నేత వి. శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐలమ్మ పోరాట పటిమను, సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించినట్లు వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.