అయోధ్య ట్రస్ట్ సీఈఓ నియామకంపై విమర్శలను తోసిపుచ్చిన జీతేంద్ర మిశ్రా
రిపోర్టర్: సురేష్
స్థలం: ఉత్తర ప్రదేశ్
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓగా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా తన నియామకంపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అనేక దేవాలయాలు, సర్వధర్మ స్థలాల నిర్వహణ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించానని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల నిర్వహణ అనుభవం లేదన్న వాదనలను కొట్టిపారేస్తూ, ఇది తన ధర్మమని పేర్కొన్నారు.