బెంగళూరులో ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీఎస్టీ అధికారి
రిపోర్టర్: సతీష్
స్థలం: బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులో లోకాయుక్త పోలీసులు జరిపిన దాడిలో ఎనిమిది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కేంద్ర జీఎస్టీ అధికారి మోహిత్ ప్రతాప్ సింగ్ అడ్డంగా దొరికారు. ఇనుప సామగ్రి వ్యాపారం చేసే ఓ వ్యాపారిపై ఉన్న తప్పుడు పన్ను ఎెగవేత కేసును మూసివేసేందుకు తొలుత ఇరవై లక్షలు డిమాండ్ చేసి, చివరకు ఎనిమిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యవర్తి సల్మాన్ షేక్‌తో కలిసి నగదు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.