వైభవంగా సాగిన వైసీపీ నేత కుమారుడి వివాహంలో మేకపాటి రాజగోపాల్ ఆశీస్సులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరికుంటపాడు
వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోను రత్నా రెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఘనంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.