దక్షిణ తెలంగాణ ప్రజలను అవమానిస్తే తీవ్ర పరిణామాలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు అవ్వారి శివలింగం తీవ్రంగా ఖండించారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదంటూ కేటీఆర్ మాట్లాడటం దక్షిణ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, రేవంత్రెడ్డి హయాంలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని నాయకులు స్పష్టం చేశారు.