హైదరాబాద్‌లో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు పూర్తి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగర విస్తరణ, జనాభా మరియు నేరాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు, జోన్లు మరియు డివిజన్ల సరిహద్దుల పునర్విభజనకు కసరత్తు పూర్తయింది. శివారు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేయడానికి, ట్రాఫిక్ నియంత్రణకు అదనపు స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.