తిరుమల భక్తులకు టీటీడీ గిఫ్ట్: త్వరలో అందుబాటులోకి గరుడ యాప్

రిపోర్టర్: రాము స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో సరికొత్త డిజిటల్ సేవను తీసుకొస్తోందని అధికారులు వెల్లడించారు. గరుడ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్ త్వరలోనే భక్తుల ముందుకు రానుంది. ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని, తిరుమలలో భక్తులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచామని తితిదే వర్గాలు తెలిపాయి.