చింతపల్లిలో అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణంతో అల్లాడుతున్న గిరిజన గ్రామస్తులు

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ బండ్రేవ్ బ్రిడ్జి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా తాత్కాలికంగా అది కూడా రైతులే చేసుకొనుండేరు దారి కొట్టుకుపోవడంతో తూరుమామిడి, వీరవారము, బురదమామిడి, బూరుగుబైలు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎంత చెప్పినా కాంట్రాక్టర్ స్పందించడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జిని పూర్తి చేయాలని అమ్ము పరమేశ్వరరావు పీస కమిటీ మరియు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.