ఢిల్లీ రంజీ జట్టు ప్రధాన కోచ్గా విజయ్ దహియా నియామకం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ రంజీ ట్రోఫీ జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియాను నియమించినట్లు డిడిసిఎ వర్గాలు వెల్లడించాయి. 2026-27 దేశీయ సీజన్ కోసం ఈ కీలక నియామకం చేపట్టినట్లు బోర్డు తెలిపింది. అలాగే విరాట్ కోహ్లీ బాల్య కోచ్ రాజ్కుమార్ శర్మను రాష్ట్ర జట్టు మెంటార్గా ఎంపిక చేశారు. మరోవైపు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా కేపీ భాస్కర్ను నియమించారు. గతంలో దహియా మార్గదర్శకత్వంలో ఢిల్లీ జట్టు రంజీ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.